Share News

డీప్‌టెక్‌లకు ఊతం

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:15 AM

సీఎం చంద్రబాబు నేతృత్వంలో పాన్‌ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో డిక్లరేషన్‌ను విడుదల చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ అలుమ్ని ప్రతినిధులు సంతకాలు చేశారు. ఏపీ ప్రభుత్వం- పాన్‌ ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో అమరావతిలో శాశ్వత కౌన్సిల్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారు

డీప్‌టెక్‌లకు ఊతం

రూ.500 కోట్లతో వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు

పాన్‌ ఐఐటీ అమరావతి సమ్మిట్‌ డిక్లరేషన్‌

సీఎం చంద్రబాబు నేతృత్వంలో పాన్‌ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో డిక్లరేషన్‌ను విడుదల చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ అలుమ్ని ప్రతినిధులు సంతకాలు చేశారు. ఏపీ ప్రభుత్వం- పాన్‌ ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో అమరావతిలో శాశ్వత కౌన్సిల్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారు. డీప్‌టెక్‌ అభివృద్ధికి నోడల్‌ సంస్థగా పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌ పనిచేస్తుంది. డీప్‌టెక్‌ స్టార్ట్‌పలు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీలోని వివిధ విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌ కంపెనీలను సమన్వయం చేసుకుంటూ ఈ కౌన్సిల్‌ పని చేస్తుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో 10 ఇండస్ట్రీ చైర్స్‌ ఏర్పాటు చేసి పరిశోధన, నైపుణ్యాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. 100 మంది గ్లోబల్‌ ఐఐటీ మెంటర్ల నెట్‌వర్క్‌తో ఏపీ స్టార్ట్‌పలు, ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు 23 ఐఐటీల నుంచి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి కార్యాచరణకు రంగం సిద్ధమైంది. డీప్‌టెక్‌ పాలసీ ప్యాకేజీ కింద క్వాంటమ్‌-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్‌-డిఫెన్స్‌, హెల్త్‌, అగ్రిటెక్‌, బ్లూ వాటర్‌ ఎకానమీలో పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ ఉండాలని నిర్ణయించారు. 2030 నాటికి ఏపీలో కనీసం 50 స్టార్ట్‌పలను ఇంక్యుబేట్‌ చేసేలా ప్రణాళికను రూపొందిస్తారు. ఏపీలోని 10 విశ్వవిద్యాలయాలను పాన్‌ ఐఐటీ ఎకో సిస్టమ్‌తో అనుసంధానం చేసి పరిశోధన, ఫ్యాకల్టీ, విద్యార్ధులకు అందుబాటులో తీసుకువచ్చేలా కార్యక్రమం రూపొందించనున్నారు.

‘క్యూ-శివ’ను ఆవిష్కరించిన సీఎం

‘మేకిన్‌ అమరావతి’ సంకల్పంతో రూపొందించిన ‘క్యూ-శివ’ హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను చంద్రబాబు ఆవిష్కరించారు. దేశీయ పరిజ్ఞానంతో క్వాంటం హార్డ్‌వేర్‌ను రూపొందించిన క్యూబిక్‌ ఫోర్స్‌ సంస్థ... ఈ ల్యాబ్‌లను పూర్తిగా అమరావతి- మచిలీపట్నం పరిజ్ఞానంతో రూపొందించింది. సంస్థ సీఈవో ఎల్‌. వెంకట సుబ్రహ్మణ్యం రూపొందించిన ఈ ల్యాబ్స్‌ను దేశంలోని ఐదు వర్సిటీలు దక్కించుకున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 05:15 AM