వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకం
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:50 AM
రాష్ట్ర పశుసంవర్ధకశాఖలో ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(వీఏఎస్)ల నియామకాలను చేపట్టనుంది. జాబ్ క్యాలెండర్-2026 రెండో దశలో చేర్చిన ఈపోస్టులను భర్తీ చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఉత్త్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పశుసంవర్ధకశాఖలో ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(వీఏఎస్)ల నియామకాలను చేపట్టనుంది. జాబ్ క్యాలెండర్-2026 రెండో దశలో చేర్చిన ఈపోస్టులను భర్తీ చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదని స్పష్టం చేసింది. మెరిట్ ఆధారిత ఎంపిక విధానం, వెయిటేజ్‌ని పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశించింది. ఈ విధానం క్యాలెండర్-2026 రెండో దశలో చేపట్టే ఈ నియామకానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యేక నిబంధనలు, నియామక విధానానికి అనుగుణంగా ఈ ప్రక్రియ జరగాలని పేర్కొంది. కాగా, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాన్ని గతంలో సెలక్షన్ కమిటీ ద్వారా నిర్వహించేది. విద్యార్హత, ఉన్నత విద్యార్హత, సంబంధిత సేవా అనుభవం, గ్రాడ్యుయేషన్ తర్వాత సీనియారిటీ ఆధారంగా, ప్రతిభ ఆధారిత ఎంపిక పద్ధతిని పాటించారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’