Share News

రాయలపాలన రతనాల పాలన

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:38 PM

శ్రీకృష్ణదేవరాయ పాలన రతనాల పాలనగా సాగిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

రాయలపాలన రతనాల పాలన
మాట్లాడుతున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం ఆవిష్కరణ

నంద్యాల రూరల్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణదేవరాయ పాలన రతనాల పాలనగా సాగిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. ఆదివారం బలిజ, కాప్స్‌రాక్స్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో ఏ ర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమీపంలోని దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప చక్రవర్తి శ్రీకష్ణదేవరాయులు అని కొనియాడారు. మార్కాపురంలో శ్రీకృష్ణదేవరాయుల సతీమణి పేరున కూడా నేటికీ పెద్దచెరువు ఉండడం ప్రత్యక్ష నిదర్శనమన్నారు. దశాబ్దాలుగా పెం డింగ్‌లో ఉన్న విగ్రహ ఏర్పాటకు సహకరించిన మంత్రి ఫరూక్‌కు భవిష్యత్‌లో కూడా మద్దతు తెలుపుతామని బలిజ సంఘ పెద్లలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపట్టి హరిబాబు. రాష్ట్ర టీడీపీ యువ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్‌, బలిజ సంఘ నాయకులు శాంతిరాముడు, రామచంద్రరావు, రాజారాం, ఆర్పీఎఫ్‌ అధ్యక్షుడు శేఖర్‌, శెట్టి విజయ్‌ కుమార్‌, నాగేశ్వరరావు, మల్లికార్జున, శ్రీనివాసులు, చలంబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:38 PM