Share News

100 కోట్ల ఉచిత ప్రయాణాలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:53 AM

ఆడబిడ్డల ఆదరణతో, మాతృమూర్తుల ఆమోదంతో స్త్రీశక్తి పథకం చరిత్రాత్మక మైలురాయిని చేరుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

100 కోట్ల ఉచిత ప్రయాణాలు

చరిత్రాత్మక మైలురాయిని చేరిన స్త్రీశక్తి: సీఎం

ఆడబిడ్డల ఆదరణతో, మాతృమూర్తుల ఆమోదంతో స్త్రీశక్తి పథకం చరిత్రాత్మక మైలురాయిని చేరుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీశక్తి, 100 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటిదాకా ఈ పథకం ద్వారా మహిళలు రూ.3,550 కోట్ల మేర ఆదా చేసుకున్నారని, ఇలా ఆదా అయిన ప్రతి రూపాయీ వారి పిల్లల చదువుకు, కుటుంబ అవసరాలకు, భవిష్యత్తుకు ఉపయోగపడాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఆదరిస్తున్న మహిళలందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 03:53 AM