దక్షిణాఫ్రికా చేరుకున్న స్పీకర్ అయ్యన్న
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:42 AM
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దక్షిణాఫ్రికా చేరుకున్నారు. 18వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
నేటి నుంచి 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్
అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దక్షిణాఫ్రికా చేరుకున్నారు. 18వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా.. శనివారం అక్కడి.. ‘భారతరత్న’ నెల్సన్ మండేలా నివాసాన్ని, మండేలా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మ్యూజియంను స్పీకర్ సందర్శించారు. వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న అయ్యన్న.. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ప్రసిద్ధ లయన్ అండ్ సఫారీ పార్కును కూడా సందర్శించారు. పార్కు నిర్వాహకులతో మాట్లాడి నిర్వహణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ వెంట శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి