Share News

గోదావరి పుష్కరాలకు మరో రూ.100 కోట్లు

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:44 AM

AP Releases Rs 100 Crore for Pushkaramsగోదావరి పుష్కరాల సందర్భంగా మూడు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల ద్వారా రూ.100 కోట్లు విడుదల చేశారు.

గోదావరి పుష్కరాలకు మరో రూ.100 కోట్లు

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): AP Releases Rs 100 Crore for Pushkaramsగోదావరి పుష్కరాల సందర్భంగా మూడు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల ద్వారా రూ.100 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో డా.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రూ.90 కోట్లతో 111 పనులను చేపట్టనున్నారు. 141 కి.మీ. సీసీ, బీటీ రహదారుల నిర్మాణం చేపడతారు. రూ.10 కోట్లతో భక్తులకు తాగునీటి సదుపాయాలు కల్పిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం, రంపచోడవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు తదితర నియోజకవర్గాల్లో గ్రామాల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.


అవసరమైన చోట్ల గ్రామాల్లో అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తారు. గ్రామీణ రహదారులతోపాటు ప్రతి పుష్కర ఘాట్‌లో రక్షిత తాగు నీటి సరఫరా బాధ్యతలను కూడా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రూ.7 కోట్ల వ్యయంతో మునికూడలిని ‘‘మోడల్‌ పుష్కర పంచాయతీ’’గా అభివృద్ధి చేస్తున్నారు. సప్త ఋషి ఘాట్‌కు సకల హంగులు కల్పించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో సీసీ రహదారుల నిర్మాణం, టవర్‌ లైట్ల ఏర్పాటు, మునికూడలి గ్రామంలో మ్యాజిక్‌ డ్రెయిన్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, పుష్కర ఘాట్ల వద్ద మరుగుదోడ్ల నిర్మాణం వంటి పనులు పూర్తికావస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేటాయించిన రూ.100 కోట్లను ఆయా జిల్లాల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా ప్రాధాన్యక్రమంలో వినియోగించనున్నారు. పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, డా.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వినియోగిస్తారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 04:44 AM