Share News

డార్క్‌వెబ్‌లో దాక్కున్నా పట్టేస్తారు!

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:11 AM

డిజిటల్‌ నేరాలు.. సోషల్‌ మోసాలు.. ఆన్‌లైన్‌ అక్రమాలను అరికట్టేందుకు ఏపీ పోలీసు శాఖ నడుం బిగించింది. పోలీసులకు సవాలుగా మారిన సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ‘సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్లు’ (సీ4) ఏర్పాటు చేస్తున్న ఏపీ పోలీసు శాఖ కానిస్టేబుల్‌ స్థాయి వరకూ సైబర్‌ నేరాల వెలికితీత పట్ల అవగహన పెంచుతోంది.

డార్క్‌వెబ్‌లో దాక్కున్నా పట్టేస్తారు!

  • సైబర్‌ నేరగాళ్లకు ఉచ్చు బిగిస్తున్న ఏపీ పోలీసు శాఖ

  • డిజిటల్‌ అరెస్టులు, మ్యూల్‌, క్రిప్టో ఖాతాలపై ఫోకస్‌

  • డిలీట్‌ చేసిన మెసేజ్‌లు, వీవోఐపీ కాల్స్‌ ఛేదన

  • సీఐడీ అధికారులు, సిబ్బందికి సైబర్‌ సెక్యూరిటీ శిక్షణ

అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ నేరాలు.. సోషల్‌ మోసాలు.. ఆన్‌లైన్‌ అక్రమాలను అరికట్టేందుకు ఏపీ పోలీసు శాఖ నడుం బిగించింది. పోలీసులకు సవాలుగా మారిన సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ‘సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్లు’ (సీ4) ఏర్పాటు చేస్తున్న ఏపీ పోలీసు శాఖ కానిస్టేబుల్‌ స్థాయి వరకూ సైబర్‌ నేరాల వెలికితీత పట్ల అవగహన పెంచుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర సీఐడీ అధికారులు మూడు రోజుల పాటు వివిధ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు ‘సైబర్‌ సెక్యూరిటీ - సైబర్‌ హైజీన్‌’ పేరుతో శిక్షణ ఇస్తోంది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో కొనసాగనున్న ఈ శిక్షణలో డార్క్‌వెబ్‌లో దాక్కున్న వారిని సైతం గుర్తించేలా సిబ్బందిని తీర్చిదిద్దనున్నారు.

రోజురోజుకూ మారుతోన్న సేబర్‌ నేరాల్లో క్రిమినల్స్‌ను గుర్తించడం, డిజిటల్‌ ఆధారాల సేకరణ, సీడీఆర్‌ విశ్లేషణ, వెబ్‌ ఇంటెలిజెన్స్‌, ఐపీ అడ్ర్‌సలతో పాటు వెబ్‌సైట్లు-ఈ మెయిల్స్‌ గుర్తింపు, వీవోఐపీ కాల్స్‌ విశ్లేషణ తదితర అంశాలపై సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. నిందితులకు చట్టపరంగా నోటీసులు జారీచేయడం నుంచి డిజిటల్‌ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్‌ టూల్స్‌ వినియోగంపై మంగళగిరిలోని ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ప్రాక్టికల్‌ డెమో నిర్వహిస్తున్నారు. కేస్‌ స్టడీలు, లైవ్‌ డెమోతో పాటు సైబర్‌ నేరగాళ్లు తొలగించిన మెసేజ్‌లు, మ్యూల్‌ ఖాతాల వివరాలు, క్రిప్టో ద్వారా డబ్బు మళ్లింపుపైనా డిజిటల్‌ ఆధారాలు సేకరించి నేరగాళ్లను గుర్తించే పద్ధతులు నేర్పిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 04:11 AM