Share News

ఒక్క ఓటుతో తలరాత మారింది.. ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల వేళ ఆసక్తికర ఘటనలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 07:19 PM

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ఆసక్తికరమైన ఘటనలు కొన్ని జరిగాయి. వీటిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఒక్క ఓటుతో తలరాత మారింది.. ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల వేళ ఆసక్తికర ఘటనలు
వేర్వేరు పార్టీల నుంచి విజయం సాధించిన తండ్రీకూతుళ్లు

అమరావతి, నవంబరు 7: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాల వేళ ఆసక్తికరమైన ఘటనలు కొన్ని జరిగాయి. వీటిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆశ్చర్యపరిచే ఈ ఘటనలను ఒక్కొక్కటిగా తెలుసుకుందామా...


ఒక్క ఓటుతో మారిన కథ

నెల్లూరు జిల్లా చిల్లకూరులోని తమ్మనపట్నంలో ఒక్క ఓటు ఫలితాలను నిర్ణయించింది. అక్కడ టీడీపీ అభ్యర్థి అరుణ ఒక్క ఓటు తేడాతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో సదరు వైసీపీ అభ్యర్థి న్యాయం చేయండంటూ కౌంటింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణ కుమారి కూడా ఒక్క ఓటు తేడాతోనే గెలిచారు. ఈ ఇద్దరి పేర్లు అరుణ కావటం ఆసక్తి రేపింది.

తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. గెలుపు ఇద్దరిదీ

కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వైసీపీ అభ్యర్థి పొనుగుపాటి సత్యనారాయణ పలివెల-2 ఎంపీటీసీ స్థానం కోసం బరిలో నిలబడ్డారు. ఆయన కుమార్తె చాందిని టీడీపీ నుంచి కొత్తపేట-2 ఎంపీటీసీ స్థానం కోసం పోటీపడ్డారు. అయితే ఎన్నికల్లో తండ్రీకూతుళ్లు ఇద్దరూ విజయం సాధించారు.


జగన్ మేనత్త గ్రామంలో టీడీపీ జెండా

ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గెలుపొందారు. జగన్ మేనత్త, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి విమలమ్మ స్వగ్రామం ఇది. ఇక్కడ టీడీపీ 20 ఏళ్ల తరువాత గెలిచింది.

తోడికోడళ్ల సమరం.. జనసేనకు విజయం

పశ్చిమ గోదావరి ఆచంట మండలం పెదమల్లంలో తోడికోడళ్ల మధ్య ఎంపీటీసీ స్థానం కోసం పోరు జరిగింది. ఇందులో వైసీపీ అభ్యర్థిపై జనసేన అభ్యర్థి విజయం సాధించారు. 18 ఓట్ల మెజార్టీతో ఆమెను విజయం వరించింది.


ఈ వార్తలూ చదవండి

దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

ప్రపంచ రికార్డు.. లద్దాఖ్‌లో 13,629 అడుగుల ఎత్తులో ఐఏఎఫ్ విమానం ల్యాండింగ్..

Updated Date - Nov 07 , 2026 | 07:31 PM