Share News

మత్స్యకారుల ప్రాణభద్రతే మాకు ముఖ్యం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:47 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు.. ఎక్స్ వేదికగా సూచనలు చేశారు.

మత్స్యకారుల ప్రాణభద్రతే మాకు ముఖ్యం: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, సెప్టెంబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మత్స్యకారులకు సూచనలు చేశారు. ‘బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకార సోదరులందరూ అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు. ఇప్పటికే వేటకు వెళ్లినవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాన’ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. తీరప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు మత్స్యకారులకు చేరవేయాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులందరూ అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆయన కోరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రీజినల్ రింగ్ రోడ్డుకు బీజేపీ సహకరించాలి.. కేంద్రం ముందుకు రావాలి: మంత్రి శ్రీధర్ బాబు

కొవ్వూరు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిన పలు రైళ్ల రాకపోకలు

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 11 , 2026 | 01:31 PM