ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 2 గుర్తులను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ
ABN , Publish Date - Oct 21 , 2026 | 05:07 PM
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల గుర్తుల జాబితా నుంచి ‘బకెట్’, ‘పెన్‌స్టాండ్’ గుర్తులను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ, అక్టోబర్ 21: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో గుర్తులకు సంబంధించి ఎన్నికల సంఘం కీలకనిర్ణయం తీసుకుంది. గుర్తుల జాబితా నుంచి ‘బకెట్’, ‘పెన్ స్టాండ్’ గుర్తులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
‘బకెట్’, ‘పెన్ స్టాండ్’ గుర్తులు జనసేన అభ్యర్థుల గుర్తులను పోలి ఉండడంతో ఓటర్లు ఎటువంటి సంశయానికి లోనుకాకుండా ఉండేందుకు వీలుగా.. ఈ గుర్తులను ఎన్నికల గుర్తుల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్రఎన్నికల సంఘ అధికారి వెల్లడించారు. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తుల జాబితా నుంచి ‘బకెట్’, ‘పెన్ స్టాండ్’ గుర్తులను ఫ్రీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికీ ఈ రెండు గుర్తులను కేటాయించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.