Share News

ఆ వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించండి: హైకోర్టు

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:17 AM

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకునే ప్రమాదం ఉందని, తమకు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ...

ఆ వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించండి: హైకోర్టు

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకునే ప్రమాదం ఉందని, తమకు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తిరుపతి, అనంతపురం, పల్నాడు తదితర జిల్లాల్లోని గ్రామాల్లో వైసీపీ తరఫున సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న పలువురు హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. అభ్యర్థుల వినతులు పరిగణనలోకి తీసుకుని భద్రత కల్పించాలని జస్టిస్‌ ఎం.కిరణ్మయి పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 02:17 AM