Share News

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల బకాయిల చెల్లింపులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:43 PM

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల బకాయిల చెల్లింలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 400 మంది బకాయిల చెల్లింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.22 కోట్ల బకాయిల చెల్లింపులకి జీవో విడుదల చేసింది.

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల బకాయిల చెల్లింపులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఇంటర్‌నెట్ డెస్క్: నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 400 మంది బకాయిల చెల్లింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.22 కోట్ల బకాయిల చెల్లింపులకు జీవో విడుదల చేసింది.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాలాభిషేకం చేసి మాట్లాడారు. 11 ఏళ్ల కార్మికుల నిరీక్షణ ఫలించిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ సమస్యని ఎన్నికల అస్త్రంగా వాడుకుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తాము ప్రారంభోత్సవాలు చేస్తుంటే, అవి వైసీపీ హయాంలో జరిగిన పనులని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. భారీగా ఈవ్‌టీజర్ల అరెస్ట్

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ ఎదుట హజరుకానున్న ఎమ్మెల్యే గాంధీ

For More TG News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 01:49 PM