Share News

స్థానికంపై నేడు కూటమి భేటీ

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:35 AM

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు సీఎం నివాసానికి రానున్న పవన్‌, సుమారు గంటపాటు చంద్రబాబుతో సమావేశం కానున్నారు.

స్థానికంపై నేడు కూటమి భేటీ

  • చంద్రబాబుతో పవన్‌, మాధవ్‌ సమావేశం

  • దానికి ముందు విడిగా బాబు, పవన్‌ భేటీ

అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు సీఎం నివాసానికి రానున్న పవన్‌, సుమారు గంటపాటు చంద్రబాబుతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఇతర రాజకీయ అంశాలపై నేతలిద్దరూ చర్చించనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వీరిద్దరు ఏకాంతంగా సమావేశం కానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అనంతరం మాధవ్‌ కూడా వారితో సమావేశమవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు జరిపింది. స్థూలంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై ఈ సమావేశాల్లో ఓ అవగాహనకు వచ్చారు. తాజాగా దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారు.

ఊహాగానాలకు చెక్‌ పెడుతూ..

కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అలిగారని, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నారని జరుగుతున్న ప్రచారాలకు చెక్‌ పెడుతూ చంద్రబాబు, పవన్‌ ఇటీవల వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయగిరి, మదనపల్లె, ప్రొద్దుటూరుల్లో జరిగిన కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. పల్లె పండుగ 3.0, గ్లోబల్‌ హార్టీ కల్చర్‌ హబ్‌ శంకుస్థాపన, అమరజీవి జలధార కార్యక్రమాల్లో వేదిక పంచుకోవడం, పక్కపక్కనే ఆసీనులై నవ్వుతూ మాట్లాడుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. తాజాగా మరోసారి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీతో అన్నిరకాల ఊహాగానాలకు చెక్‌ పడనుంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 04:35 AM