11 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:41 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 11న ప్రారంభమవుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం శనివారం తెలిపింది.
అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 11న ప్రారంభమవుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం శనివారం తెలిపింది. ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది. 26 నుంచి డిసెంబరు 2 వరకు రూ.50, డిసెంబరు 3 నుంచి 9 వరకు రూ.200, డిసెంబరు 10 నుంచి 15 వరకు రూ.500 ఫైన్‌తో ఫీజులు చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60, వయసు మినహాయింపు కోరేవారు రూ.300 చెల్లించాలి. పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే ఫీజులు చెల్లించాలని పరీక్షల విభాగం స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..