రాజమండ్రి బీసీ గర్ల్స్ హాస్టల్‌లో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 09:12 PM
విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని, హాస్టళ్లలో వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని గణేశ్ చౌక్ లో ఉన్న బీసీ ప్రభుత్వ బాలికల కళాశాల హాస్టల్ ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.
రాజమండ్రి,మార్చి 23: విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, హాస్టళ్లలో వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని గణేశ్ చౌక్‌లో ఉన్న బీసీ ప్రభుత్వ బాలికల కళాశాల హాస్టల్‌ను ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత హాస్టల్‌లోని ప్రతి గదిని పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. అక్కడ అందుతున్న వసతులు, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఫార్మసీ, పారామెడికల్ తదితర కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థినులు, తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో జాప్యం జరుగుతోందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హాస్టల్ మెస్‌ను తనిఖీ చేసిన మంత్రి, విద్యార్థునుల కోసం వండిన ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూశారు. అనంతరం విద్యార్థినులలో కలిసి కూర్చుని కాసేపు ముచ్చటించారు. భోజనం నాణ్యతపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ..‘బీసీ హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోంటోంది’ అని అన్నారు.
Also Read:
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే
For More Latest News