Share News

ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:00 PM

ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..
Andhra Pradesh Budget 2026 27

అమరావతి, ఫిబ్రవరి 14: ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.

బడ్జెట్‌ స్వరూపం..

  • 2026-27 వార్షిక బడ్జెట్: రూ.3,32,205 కోట్లు

  • రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు

  • మూలధన వ్యయం: రూ.53,915 కోట్లు

  • రెవెన్యూ లోటు: రూ.22,002 కోట్లు

  • ద్రవ్య లోటు: రూ.75,868 కోట్లు


బడ్జెట్ కేటాయింపు వివరాలు ఇవే:

  • రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు

  • విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు

  • రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు

  • 'వీబీ జీ రామ్‌ జీ'కి రూ.8,365 కోట్లు

  • గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు

  • పరిశ్రమలకు రూ.3,161 కోట్లు


  • సర్దుబాటు నిధి రూ.1,500 కోట్లు

  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు

  • ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4,000 కోట్లు

  • జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు


2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయం-నీటి భద్రత కేటాయింపులు:

  • మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు

  • అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు

  • పోలవరం – రూ.6,105 కోట్లు

  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు

  • ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు

  • మత్స్యకార సేవలో – రూ.260 కోట్లు

  • పంటల బీమా – రూ.250 కోట్లు

  • పీఎం కృషి సించాయి యోజన – రూ.190 కోట్లు


సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు:

  • ఎన్టీఆర్ భరోసా - రూ.27,719 కోట్లు

  • దీపం 2.0 - రూ.2,601 కోట్లు

  • వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు - రూ.2,320 కోట్లు

  • స్త్రీశక్తి - రూ.1,420 కోట్లు

  • వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు

  • ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు

  • తల్లికి వందనం – రూ.9,668 కోట్లు

  • స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు

  • ఉపకార వేతనాలు – రూ.3,836 కోట్లు


  • సమగ్ర శిక్ష – రూ.2,946 కోట్లు

  • ఉన్నత విద్య – రూ.2,566 కోట్లు

  • డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ.2,161 కోట్లు

  • మన బడి మన భవిష్యత్ – రూ.1,500 కోట్లు

  • నైపుణ్యాభివృద్ధి – రూ.1,232 కోట్లు

  • పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ.707 కోట్లు

  • సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర – రూ.654 కోట్లు

  • యువత, క్రీడలు – రూ.438 కోట్లు


శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపు:

  • వ్యవసాయ అనుబంధ రంగాలు - రూ.13,598 కోట్లు

  • పంచాయతీరాజ్ శాఖ - రూ.22,942 కోట్లు

  • మున్సిపల్ శాఖ - రూ.14,539 కోట్లు

  • జల వనరుల శాఖ - రూ.18, 224 కోట్లు

  • పాఠశాల విద్యాశాఖ - రూ.32,308 కోట్లు


  • ఇంధన శాఖ - రూ.13,934 కోట్లు

  • సాంఘిక సంక్షేమ శాఖ - రూ.11,118 కోట్లు

  • కార్మిక శాఖ - రూ.735 కోట్లు

  • గృహ నిర్మాణ శాఖ - రూ.6357 కోట్లు

  • రోడ్లు, భవన నిర్మాణాల శాఖ - రూ.9,856 కోట్లు

  • హోం శాఖ - రూ.9,165


ఇతర కేటాయింపులు

  • పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు

  • కొత్త పోలీస్ అకాడమీ కోసం 94 ఎకరాలు

  • ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4,000 కోట్లు

  • జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు

  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు

  • విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు

  • విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు


  • 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం

  • రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు

  • ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌

  • అన్నదాత సుఖీభవకు రూ.6,660 కోట్లు

  • పోలవరంకు రూ.6,105 కోట్లు

  • హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు


ఇవి కూడా చదవండి...

ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్: మంత్రి పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

Updated Date - Feb 14 , 2026 | 01:37 PM