పార్వతీపురం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన బొలెరో వాహనం.. పలువురికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - May 06 , 2026 | 09:31 PM
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ పరిధిలోని సవరపాడు ఘాట్ రోడ్డులో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
పార్వతీపురం మన్యం జిల్లా, మే 06: జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ పరిధిలోని సవరపాడు ఘాట్ రోడ్డులో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీతంపేట మండలం బెనరాయ్ గ్రామానికి చెందిన సుమారు 40 మంది.. పుట్టిగాం గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు బొలెరో వాహనంలో వెళ్లారు. వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. సవరపాడు ఘాట్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నీలమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా భార్య దారుణ హత్య
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బీరువలి గ్రామంలో కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో భర్త వెంకటస్వామి తన భార్య లక్ష్మిని (36) గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వెంకటస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మహ్మద్ నసీర్
కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ
For More AP News And Telugu News