Share News

ఏపీలో అన్ని ప్రాంతాల్లో సోలార్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్‌ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీలో అన్ని ప్రాంతాల్లో సోలార్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం: మంత్రి లోకేశ్
AP Minister Lokesh

అనంతపురం, ఆగస్టు 25: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్‌ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు.


అలాగే సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్‌ను ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సుజ్లాన్ సంస్థ ప్రకటించింది.


ఏపీలో 1700 మెగావాట్లకు పైగా సుజ్లాన్ సామర్థ్యం..

రాష్ట్రంలో సుజ్లాన్ ఇప్పటికే కీలక పవన్ విద్యుత్ సంస్థగా ఎదిగింది. ఏపీలో ఈ సంస్థకు 1700 మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యం ఉంది. ఇది 2030 నాటికి అదనంగా 5 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని సుజ్లాన్ ప్రణాళికలు రూపొందించింది. నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు ఈ సంస్థ ముందుకు సాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు

ఆన్‌లైన్ స్నేహం పేరుతో భారీ మోసం.. రూ.కోటిన్నర పోగొట్టుకున్న యువతి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 04:12 PM