దారుణం.. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కిన సైకో
ABN , Publish Date - Feb 17 , 2026 | 09:57 AM
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను ఓ సైకో దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి 17: మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. అయితే, ఆమె ఇంటి పక్కనే నివసించే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలికను కిరాతకంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని డ్రమ్‌లో కుక్కాడు. బాలిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. చిన్నారిని పక్కింటి వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక శవమై కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కాగా, నిందితుడు ఒక సైకో అని పోలీసులు నిర్ధారించారు.
ఇవి కూడా చదవండి...
రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి
Read Latest AP News And Telugu News