ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరి సజీవదహనం
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:32 PM
అనంతపురం జిల్లా డి. హిరేహాల్ మండలంలోని జూజరకల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. మంగళవారం రహదారి పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను మరో లారీ ఢీ కొట్టింది.
అనంతపురం,జూన్ 09: జిల్లాలోని డి. హిరేహాల్ మండలం జూజరకల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. మంగళవారం రహదారి పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల్లో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. రహదారిపై నిలిచిన ఉన్న వాహనాలు సజావుగా ముందుకు సాగేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో సజీవదహనమైన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్టీల్ ప్లాంట్ ఘటనపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోంది: మంత్రి నారాయణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
Read Latest AP News And Telugu News