Share News

హత్యలు, అబద్దాలు వైసీపీ నేతల డీఎన్ఏగా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:15 PM

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులు దారుణమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అబద్దాలు, హత్యలు వైసీపీ నేతల డీఎన్‌ఏగా మారిందంటూ ఆయన మండిపడ్డారు.

హత్యలు, అబద్దాలు వైసీపీ నేతల డీఎన్ఏగా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్
Anagani Satyaprasad statement

అమరావతి, ఏప్రిల్ 07: ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేసింది. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. వైసీపీ వికృత చర్యలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థలపై(ABN - Andhrajyothy) వైసీపీ నేతలు దాడులకు దిగడంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు.


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ మూకల దాడులు దారుణమన్నారు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అబద్దాలు వైసీపీ నేతల డీఎన్ఏగా మారిందంటూ మంత్రి సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రశ్నించే మీడియా గొంతు నొక్కేందుకే వైసీపీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు. అధికారంలో ఉండగా చేసిన అరాచకానికి ప్రతిఫలంగానే ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, అయినప్పటికీ బుద్ది రాక రప్పా.. రప్పా అంటూ బెరి తెగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్‌తో నవ్వుల పాలైన వైసీపీ దాడుల రూపంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

Updated Date - Apr 07 , 2026 | 02:39 PM