Share News

నేడు ఆళ్ల నాని అంత్యక్రియలు

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:20 AM

టీడీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గురువారం ఏలూరులో జరగనున్నాయి. విశాఖలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ హాజరు కానున్నారు.

నేడు ఆళ్ల నాని అంత్యక్రియలు

  • అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు,

  • హాజరుకానున్న మంత్రి లోకేశ్‌

ఏలూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గురువారం ఏలూరులో జరగనున్నాయి. విశాఖలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ హాజరు కానున్నారు. ఏలూరు శ్రీరామ్‌నగర్‌లో నాని ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న నివాసం వెనుక ఉన్న ఖాళీస్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌, ఆచంట, తాడేపల్లిగూడెం, గన్నవరం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, గ్రంధి శ్రీనివాస్‌, ముదునూరి ప్రసాదరాజు, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపన చౌదరి, వంగవీటి రంగా కుమార్తె ఆశా లత బుధవారం నాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 05:20 AM