నేటి నుంచే కలెక్టర్ల సదస్సు
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:38 AM
కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సాధారణ పరిపాలన శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తొలి రోజు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం మొదలవుతుంది.
అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సాధారణ పరిపాలన శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తొలి రోజు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం మొదలవుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ప్రాధాన్యాలను కలెక్టర్లకు వివరిస్తారు. గత కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాలపై సీసీఎల్ జి.జయలక్ష్మీ కార్యాచరణ నివేదికను ప్రవేశపెడతారు. ప్లానింగ్ విభాగం ముఖ్య కార్యదర్శి పీయూశ్ కుమార్ రాష్ట్ర ఆర్థికం, స్వర్ణాంధ్ర- 2047పై ప్రజంటేషన్ ఇస్తారు. భూముల సమస్య, సర్వే నిర్వహణ, ఇతర అంశాలపై సీఎస్, సీసీఎస్‌ఏ వివరిస్తారు. అలానే కలెక్టర్లు జిల్లాల్లో తాము చేపట్టిన ఉత్తమ పద్ధతులను వివరిస్తారు. దీనిపై ప్రత్యేక సెషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండో రోజు చివర్లో శాంతి భద్రతలపై ఐపీఎస్‌లతో చర్చిస్తారు.
ఈ వార్తలనూ చదవండి..
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు