హైవేపై పల్టీ కొట్టిన పెళ్లి బస్సు
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:44 AM
పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. ముందు వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న భారీ కంటెయినర్ లారీ అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని 43 మంది గాయపడ్డారు.
43 మందికి గాయాలు..
తుని రూరల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. ముందు వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న భారీ కంటెయినర్ లారీ అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని 43 మంది గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన వధువుకు, తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన వరునికి గురువారం తునిలో వివాహం జరిగింది. పెళ్లి వేడుక అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు ఓ ప్రైవేటు బస్సులో పెళ్లికూతురు స్వగ్రామమైన ఉప్పాడ బయలుదేరారు. బస్సు తుని వద్ద రాజుల కొత్తూరు సమీపంలో వెనుక నుంచి భారీ కంటెయినర్ లారీ ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 65మంది ఉండగా, వారిలో 43 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్సులో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: