Share News

Top Selling Smartphones Of 2025: 2025లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు ఇవే..

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:37 PM

2025లో అనేక రకాల మొబైల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫోన్లను మొబైల్స్ కంపెనీలు మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. అయితే ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు ఏంటంటే..

Top Selling Smartphones Of 2025: 2025లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు ఇవే..
Top Selling Phones 2025

ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ(బుధవారం)2025 సంవత్సరం ముగియనుంది. కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో 2025లో టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అలానే ఈ ఏడాది అనేక మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. వినియోగదారుల అవసరాలు మారడంతో మొబైల్ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హైఎండ్ కెమెరాలు, దీర్ఘకాల బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్న మొబైళ్లు భారీగా అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో కొన్ని బ్రాండ్లు 2025లో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆ టాప్ మొబైల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం...


ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మొబైల్‌గా ఆపిల్ ఐఫోన్-16 ప్రో మ్యాక్స్ నిలిచింది. కొత్త ఏ-18 బయోనిక్ చిప్, మెరుగైన ఏఐ కెమెరా సపోర్ట్, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే ఐఓఎస్ వ్యవస్థతో ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంది. అమెరికా, యూరప్‌తో పాటు భారత్‌లో కూడా ఈ మోడల్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఐఫోన్-16 ప్రో మ్యాక్స్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 అల్ట్రా రెండో స్థానంలో నిలిచింది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, AMOLED 2ఎక్స్ డిస్‌ప్లే, S-పెన్ సపోర్ట్ ఫీచర్లు ఆకర్షణగా నిలిచాయి. ఫోటోగ్రఫీ, వీడియో కంటెంట్ క్రియేషన్ చేసే వినియోగదారుల నుంచి ఈ మోడల్‌కు మంచి స్పందన లభించింది.


ఏఐ ఆధారిత ఫీచర్లతో ముందుకు వచ్చిన గూగుల్ పిక్సెల్-10 ప్రో కూడా 2025లో టాప్ సెల్లింగ్ జాబితాలో స్థానం దక్కించుకుంది. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్‌, స్మార్ట్ ఫోటో ఎడిటింగ్‌, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లు ఉన్నాయి. స్టాక్ ఆండ్రాయిడ్ ను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇక ధరకు తగిన ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకెళ్లిన ఫోన్‌గా షియోమీ 14 అల్ట్రా కూడా భారీగా విక్రయించబడింది. 120W ఫాస్ట్ చార్జింగ్‌, పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ భారత మార్కెట్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే, 2025లో మొబైల్ కొనుగోలు చేసే వినియోగదారులు స్మార్ట్ ఫీచర్లు, పనితీరు, కెమెరా క్వాలిటీకి పెద్దపీట వేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత మొబైళ్లు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయని సాకేంతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇవీ చదవండి:

అంతరిక్ష రంగం.. ఇస్రో సారథ్యంలో భారత్‌కు అద్భుత విజయాలు

ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు

Updated Date - Dec 31 , 2025 | 01:57 PM