Share News

Cold Waves: పంజా విసిరిన చలి పులి.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 08:39 AM

రాష్ట్రంలో రానున్న రోజుల్లో సైతం చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఆది, సోమవారాల్లో చలి తీవ్రత ఉటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

Cold Waves: పంజా విసిరిన చలి పులి.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్/ అమరావతి, డిసెంబర్ 28: రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లో పగటిపూట ఎండలు కాస్తున్నప్పటికీ రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి.

ఏపీని చలి గజగజ వణికిస్తోంది. ఎప్పుడు లేనంతగా చలి ఈ ఏడాది ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత తీవ్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా అరకు, పాడేరు, చింతపల్లి, వై.రామవరం, ముంచింగిపుట్టు తదితర ప్రాంతాల్లో ఉష్ణాగ్రతలు కనిష్ఠానికి చేరాయి. గతంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి చలి తక్కువగా ఉండేది. కానీ ఈ ఏడాది పరిస్థితులు దాదాపుగా తలకిందులయ్యాయి.


పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఉత్తర భారతం నుంచి అతి శీతల గాలులు నేరుగా రాష్ట్రంలోని వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు ప్రభావంతో ఈ శీతల గాలులు ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా చలి గాలుల తీవ్రం ఈ ఏడాది అధికంగా ఉందని వెల్లడిస్తున్నారు.


మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న విషయం విదితమే. ఉష్ణోగత్రలు భారీగా పడిపోవడంతో.. రహదారులు మంచు దుప్పటిని కప్పుకున్న పరిస్థితి నెలకొంది. రాత్రి 8 గంటలు అయితే మంచు కమ్మేస్తోంది. ఉదయం పూట రహదారులపై మంచు కురుస్తుంది. దీంతో ప్రయాణం ఇబ్బందికర పరిస్థితిగా మారింది.

ఇదే పరిస్థితి..

రాష్ట్రంలో రానున్న రోజుల్లో సైతం చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఆది, సోమవారాల్లో చలి తీవ్రత ఉటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది.


ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో బయటకు వెళ్లే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులతోపాటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉన్ని దుస్తులు ధరించడం వల్ల శరీర వేడి బయటకు వెళ్లదని చెబుతున్నారు. మంకీ క్యాప్ లేదా స్కాఫ్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.


చలికాలంలో దాహం తక్కువ వేసినప్పటికీ.. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు గోరువెచ్చని నీటిని తగినంత తీసుకోవాలని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం.. అల్లం, వెల్లులి, మిరియాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేడి వేడి ఆహారం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటుందని అంటున్నారు. శ్వాసకోస సమస్యలు, ఆస్తమ ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. యువకులు దుర్మరణం..

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?

For More TG News And Telugu News

Updated Date - Dec 28 , 2025 | 09:19 AM