Cold Wave In TG And AP: తెలుగు రాష్ట్రాల్లో విసురుతున్న చలి పంజా
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:43 AM
రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో.. తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి.
హైదరాబాద్/ అమరావతి, డిసెంబర్ 25: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి గజగజ వణుకుతున్నారు. వీటికి తోడు చల్లటి గాలులు వీస్తున్నాయి. దాంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా స్వల్పంగా ఉంటున్నాయి. బుధవారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఐదేళ్లలో ఇంత స్వల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవడం గమనార్హం.
డిసెంబర్ చివరి వారంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని.. మాసాంతం వరకు ఇలాగే ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. జిల్లా్లో సైతం భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.
వచ్చే రెండు రోజులు వణుకు..
రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్ర, శనివారాల్లో చలి తీవ్రత బాగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇలా ..
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. మరి ముఖ్యంగా గత వారం.. 10 రోజులుగా చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మన్యం జిల్లాలో అయితే చలి చంపేస్తోంది. ఈ ప్రాంతంలో నీరు గడ్డకడుతుందంటే.. చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఉదయ, సాయంత వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. పొగ మంచు కారణంగా.. మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏజెన్సీలో చింతూరు, మినములూరు, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళ.. ముంచు దుప్పటి పరుచుకుంటుంది. దీంతో స్థానికులు ఇళ్లు వదలి బయటకు రావాలంటే.. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
For More AP News And Telugu News