Brahmos: ఇలాంటి క్షిపణి చైనా, పాక్ వద్ద కూడా లేదు..
ABN , First Publish Date - 2025-05-17T13:52:19+05:30 IST
బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్తాన్ దేశాల్లో లేదని అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు, రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ ప్రశంసలు కురిపించారు.
బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్తాన్ దేశాల్లో లేదని అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు, రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ ప్రశంసలు కురిపించారు. భారత ఆయుధ సంపత్తిని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ ఎంత శక్తివంతమైందో ప్రపంచ దేశాలకు నిరూపితమైందని చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్‌లో ఉన్న బ్రహ్మోస్‌తో సరిపోల్చే క్షిపణులు కానీ, ఆయుధ సామగ్రి కానీ లేవని స్పష్టం చేశారు.