వంశీ అరెస్ట్.. వైసీపీ నేతల్లో వణుకు

ABN, Publish Date - Feb 17 , 2025 | 03:40 PM

YSRCP Leaders: గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.

కృష్ణా , ఫిబ్రవరి 17: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో (YSRCP Leaders) భయం మొదలైంది. గన్నవరం టీడీపీ ఆఫీసు దగ్ధం కేసులో వైసీపీ నేతలు లొంగిపోతున్నారు. తాజాగా గన్నవరం పోలీస్‌స్టేషన్‌‌లో వైసీపీకి చెందిన సర్దార్ జానీ, కలాం లొంగిపోయారు. టీడీపీ ఆఫీస్ దగ్ధం కేసులో 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ2, ఏ3 కీలక నిందితులు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వంశీ అరెస్ట్ సమయంలో అదే రోజు వంశీ పీఏ కూడా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరిని అరెస్ట్ చేయగా... తాజాగా మరో ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కీలక నిందితులుగా ఉన్న కోట్లు, రాములు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.


ఇవి కూడా చదవండి...

విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..

వల్లభనేని వంశీకి జైలులో భద్రత

Read Latest AP News and Telugu News

Updated at - Feb 17 , 2025 | 03:44 PM