Amaravati: దూసుకుపోతున్న అమరావతి..నెరవేరుతున్న ఆంధ్రుల కల

ABN, Publish Date - Sep 14 , 2025 | 12:59 PM

రాజధాని అమరావతి నిర్మాణం వడివడిగా జరుగుతోంది. దేశంలోనే అతి కీలమైన నగరంగా నిర్మితమవుతున్న ఆంధ్రుల రాజధాని నభూతో అన్నట్లుగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫోకస్‌తో చకచకా జరుగుతున్న రాజధాని పనులను ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం పరిశీలించి, ప్రశంసించింది.

ఆంధ్రుల కళల రాజధానికి అమరావతిని నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్మించాలని సంకల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు.. తన లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా అమరావతిని ఓ మహానగరంలో కాకుండా.. ఏకంగా మరో ప్రపంచంలా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రూ.30 వేల కోట్లను రుణంగా ఇస్తున్నాయి. గత బడ్జెట్‌లో కేంద్రం రూ.1500 కోట్లను గ్రాంట్‌గా ఇచ్చింది. మిగిలిన సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించింది. అలాగే విరాళాల రూపంలో కొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధుల బృందం గురువారం అమరావతిలో పర్యటించింది. నిర్మాణ పనుల్లో పర్యావరణ, సమాజిక రక్షణ చర్యలు అమరావతి అభివృద్ధిలో పురోగతి తమ ప్రమాణాల ప్రకారం ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసింది.

Updated at - Sep 14 , 2025 | 12:59 PM