శ్రీవారి సేవలో చిరంజీవి ఫ్యామిలీ

ABN, Publish Date - Dec 30 , 2025 | 12:26 PM

మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిరంజీవి సతీమణి సురేఖతో పాటు మరికొంత మంది ఫ్యామిలీ శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో పలువురు ప్రముఖులు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ (Surekha) శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు కుమార్తెలు, మరికొంత మంది కుటుంబసభ్యులతో కలిసి సురేఖ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు.


ఏపీ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అచ్చెన్నాయుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దానం నాగేందర్, నటుడు నారా రోహిత తదితరులు కుటుంబ సమేతంగా వచ్చి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రజలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

శ్రీవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శోభ.. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు

Read Latest AP News And Telugu News

Updated at - Dec 30 , 2025 | 12:30 PM