Vijay: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకు టీవీకే అధ్యక్షుడు విజయ్

ABN, First Publish Date - 2025-04-14T12:32:50+05:30 IST

తమిళిగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ అమోదించిన వక్ఫ్‌చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సవాల్ చేయగా తాజాగా విజయ్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు.

తమిళిగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ అమోదించిన వక్ఫ్‌చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సవాల్ చేయగా తాజాగా విజయ్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. మరోవైపు వక్ఫ్‌చట్టం రాజ్యాంగ మద్దతును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే పది పిటిషన్లు దాఖలు కాగా త్రిసభ్య ధర్మసనం ముందు లిస్ట్ కావాల్సి ఉంది.


ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టీస్ కేవీ విశ్వనాధ్‌తో కూడిన ధర్మసనం విచారణ జరుపనుంది. అయితే మొదట ఈ నెల 15వ తేదీనే విచారణ చేపడతామని ధర్మసనం తెలపగా కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. తమ అభి ప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 16వ తేదీన విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభల అమోదం ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతితో వక్ఫ్ సవరణ చట్టం ఇటీవల అమల్లోకి వచ్చింది.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Minister Nara Lokesh: మీ కోసం నిలబడతా.. పోరాడతా

Police Dogs: పోలీసు జాగిలం.. బిజీబిజీ..

TTD Chairman BR Naidu: తిరుపతి ‘తొక్కిసలాట’వెనుక కుట్రకోణం!

Read Latest AP News And Telugu News

Updated at - 2025-04-14T12:41:10+05:30