Trump: ట్రంప్ నిర్ణయాలతో టెన్షన్‌లో భారతీయులు

ABN, Publish Date - Jan 20 , 2025 | 09:50 PM

ట్రంపు ప్రభావం తెలుగువారిపై ఏ మేరకు ఉండబోతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య తెలుగమ్మాయి. ఆమెతో తెలుగువారికి ఏమైనా ఉపయోగం ఉందా ..?? అమెరికాలో తెలుగువారి డామినేషన్ ప్రతి ఏటా పెరుగుతోందా..?? అమెరికాలో ఇండియన్స్ 45 లక్షల మంది ఉంటే వారిలో 12 లక్షల మంది తెలుగువారే ఉన్నారు.

ట్రంపు ప్రభావం తెలుగువారిపై ఏ మేరకు ఉండబోతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య తెలుగమ్మాయి. ఆమెతో తెలుగువారికి ఏమైనా ఉపయోగం ఉందా ..?? అమెరికాలో తెలుగువారి డామినేషన్ ప్రతి ఏటా పెరుగుతోందా..?? అమెరికాలో ఇండియన్స్ 45 లక్షల మంది ఉంటే వారిలో 12 లక్షల మంది తెలుగువారే ఉన్నారు. హెచ్1 బీ వీసాలపై మన భారతదేశంలో ఎక్కువగా క్రేజ్ ఉండేది తెలుగు రాష్ట్రాల్లోనే. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య చిలుకూరి ఉష తెలుగు మూలాలు ఉన్న వ్యక్తే. ఆమె కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం ఉష పూర్వికుల స్వగ్రామం.


ఆమె కుటుంబీకులంతా ఉన్నత విద్యావంతులే. ఆమెకు విశాఖపట్నంలోనూ బంధువులు ఉన్నారు. ఉషకు అమ్మమ్మ వరసయ్యే శాంతమ్మ విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్. ఉష తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె శాన్ డియాగోలో పుట్టి పెరిగారు. తన భర్తతో పాటే రిపబ్లికన్ పార్టీ ప్రచారంలో చిలుకూరు ఉష పాల్గొన్నారు. తన ముగ్గురు పిల్లల బాధ్యతలు చూస్తునే భర్త వాన్స్‌కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే ఉష తెలుగువారికి ప్రత్యేకంగా చేసేదేమీ ప్రత్యేకంగా ఉండకపోయినా అమెరికాలో గుర్తింపు తీసుకువచ్చారు.


మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి..

జమ్మూలో వింత వ్యాధి.. వరుస మరణాలు..

హైకోర్టుకు బీఆర్ఎస్ నేతలు..

వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 20 , 2025 | 09:52 PM