Transgenders: దసరా మామూలు ఇవ్వలేదని.. నర్స్‌పై ట్రాన్స్‌జెండర్ల దాడి..
ABN, Publish Date - Sep 24 , 2025 | 12:40 PM
దసరా మామూళ్లు ఇవ్వలేదని ఆస్పత్రిలో నర్సుపై ట్రాన్స్‌జెండర్లు దాడి చేసి దారుణంగా కొట్టారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలోకి వచ్చిన ట్రాన్స్‌జెండర్స్ అక్కడున్న ఆదిలక్ష్మి అనే నర్సును దసరా మామూళ్లు అడిగారు.
దసరా మామూళ్లు ఇవ్వలేదని ఆస్పత్రిలో నర్సుపై ట్రాన్స్‌జెండర్లు దాడి చేసి దారుణంగా కొట్టారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలోకి వచ్చిన ట్రాన్స్‌జెండర్స్ అక్కడున్న ఆదిలక్ష్మి అనే నర్సును దసరా మామూళ్లు అడిగారు. ఆమె ఇవ్వకపోవడంతో.. గంజాయి, మద్యం మత్తులో ఉన్న ట్రాన్స్‌జెండర్స్ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నర్సు ఆదిలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాన్స్‌జెండర్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated at - Sep 24 , 2025 | 12:40 PM