మహబూబ్ నగర్ జిల్లా లగచర్లలో ఉద్రిక్తత

ABN, Publish Date - Feb 07 , 2025 | 03:16 PM

మహబూబ్‌నగర్ లగచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక తండాలో భూ సర్వే కొనసాగుతోంది. అయితే సర్వే కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో సర్వే నిర్వహించవద్దని ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్ లగచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక తండాలో భూసర్వే కొనసాగుతోంది. అయితే సర్వే కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో సర్వే నిర్వహించవద్దని ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. భూసర్వే నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. గతంలో కలెక్టర్‌పై దాడి ఘటనలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.


కాగా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో ఫోన్లు చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

అన్నా క్యాంటీన్‌లో అమ్మ రాజశేఖర్ సందడి..

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళ పెట్రోల్ బాటిల్‌తో హల్ చల్

అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 07 , 2025 | 03:23 PM