Share News

Woman Protest.. మహిళ పెట్రోల్ బాటిల్‌తో హల్ చల్

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:05 PM

తనకు సమాచారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు అన్యాయంగా తన పాల కేంద్రాన్ని కూల్చి వేశారని ఓ మహిళ పెట్రోల్ బాటిల్ పట్టుకుని హల్ చల్ చేసింది. జీహెచ్ఎంసీ వాహనం ముందు కూర్చోని నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

Woman Protest.. మహిళ పెట్రోల్ బాటిల్‌తో హల్ చల్
Woman protest

హైదరాబాద్: ఉప్పల్ (Uppal) చిలకానగర్‌ (Chilkannagar)లో ఓ మహిళ (Woman) పెట్రోల్ బాటిల్‌ (Petrol Bottle)తో హల్ చల్ (Hul Chal) చేసింది. కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని (Milk center) నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్ బాటిల్ పట్టుకుని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

ఈ వార్త కూడా చదవండి..

అన్నా క్యాంటీన్‌లో అమ్మ రాజశేఖర్ సందడి..


మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Air Port) రోడ్డులో శుక్రవారం ఉదయం హైడ్రా (Hydra) అధికారులు కూల్చివేతలకు దిగారు. పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్‌ (Illegal Hoardings)లను అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలకు దిగింది. అలాగే శంషాబాద్‌లోని సిద్ధాంతి జాతీయ రహదారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రాంతంలోని హోర్డింగ్‌లను తొలగించడానికి హైడ్రా సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి పరిశీలన జరుపుతోంది. మరికొద్ది సేపట్లో కూల్చివేతల ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


కాగా కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. రెండు రోజుల క్రితం శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలను (Wall) హైడ్రా అధికారులు కూల్చివేశారు (Demolished). సర్వే నంబర్లు 601, 602 లో చేపట్టిన ప్రహరీ గోడను కూల్చివేశారు. వివాదాస్పద రోడ్డు స్థలం విషయంలో ఫిర్యాదులు రావడంతో కూల్చివేశారు. అయితే తమ పట్టా భూమిలో తాము నిర్మించుకున్న ప్రహరీ గోడను హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసారని బాధితులు మండిపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

ఆగని హైడ్రా దూకుడు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 07 , 2025 | 01:05 PM