టీడీపీ ఆఫీస్‌పై దాడి.. మరో ముగ్గురికి రిమాండ్
ABN, Publish Date - Feb 18 , 2025 | 04:13 PM
Vijayawada: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అవగా.. వారిని సీఐడీ కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.
విజయవాడ, ఫిబ్రవరి 18: కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో (TDP office attack case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను సీఐడీ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌లో ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 80 మందికి పైగా కేసులు నమోదు చేశారు. వారందరికి కూడా ఆ రోజు దాడి ఘటనలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు.
ఈ 80 మందిలో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా మందిని అరెస్ట్ చేయగా వంశీని మాత్రం ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్నారు. ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి సీఐడీ కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది స్వచ్చంధంగానే లొంగిపోతున్న పరిస్థితి. పరారీలో ఉన్న కొంతమంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News
Updated at - Feb 18 , 2025 | 04:13 PM