ఆ తవ్వకాలపై సుప్రీంలో విచారణ..

ABN, Publish Date - Feb 07 , 2025 | 03:19 PM

Supreme Court: గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వం నివేదిక దాఖలు చేసింది. అందులో మరికొన్ని విషయాలు చెప్పాల్సి ఉన్నందున కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ వాయిదా పడింది. ఈరోజు(శుక్రవారం) జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తాము చేస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలన్నీ ఆపేసినట్లు విచారణ సందర్భంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వం నివేదిక దాఖలు చేసింది. అందులో మరికొన్ని విషయాలు చెప్పాల్సి ఉన్నందున కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది.


తదుపరి చర్యలు, తాజాగా తీసుకున్న నిర్ణయాలతో తుది నివేదిక దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించిన విషయాలు, తీసుకున్న చర్యలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖకు సుప్రీం కోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

హైడ్రా దూకుడు.. ఎయిర్ పోర్టు దగ్గర..

గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్

Read Latest AP News And Telugu News

Updated at - Feb 07 , 2025 | 03:19 PM