శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మద్యం, మాంసం పట్టివేత

ABN, Publish Date - Dec 25 , 2025 | 06:29 PM

శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వందల కేజీల మాంసాహారం పట్టుబడింది. చికెన్, మటన్‌తో పాటు మద్యం కూడా పట్టుబడింది.

నంద్యాల జిల్లా, డిసెంబర్ 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పరిధిలో తప్పుడు పనులు చేయడానికి కొందరు సిద్ధమయ్యారు. భారీగా మాంసం, మద్యాన్ని క్షేత్ర పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టోల్ గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు పట్టుకున్నారు. శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వందల కేజీల మాంసాహారం పట్టుబడింది. చికెన్, మటన్‌తో పాటు మద్యం కూడా పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆ స్టార్‌ బ్యాటర్ ఆట చూసేందుకు చెట్లెక్కిన అభిమానులు.. వీడియో

ఇతడి తెలివికి ఫిదా కావాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..

Updated at - Dec 25 , 2025 | 06:29 PM