చరిత్రలో కలిసిపోయిన సికింద్రాబాద్ ఐకానిక్ భవనం..
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:51 PM
హైదరాబాద్‌లోని ఐకానిక్ భవనాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. నగరానికే తలమానికింగా ఉన్న ఈ పురాతన భవాన్ని ఆధునికీకరణ పనుల్లో భాంగా కూల్చేశారు.

హైదరాబాద్‌లోని ఐకానిక్ భవనాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. నగరానికే తలమానికింగా ఉన్న ఈ పురాతన భవాన్ని ఆధునికీకరణ పనుల్లో భాంగా కూల్చేశారు. ఈ భవనాన్ని 1874లో అప్పటి నిజాం పాలకులు నిర్మించారు. ఈ భవనం 1916 వరకూ నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేకు ప్రధాన కేంద్రంగా ఉండేది. స్వాతంత్ర్యం అనంతరం 1951లో ఎన్టీఎస్ఆర్‌ను జాతీయం చేయడంతో .. 1952లో ఈ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఈ భవనాన్ని కూల్చేశారు. సుమారు రూ.700 కోట్లతో అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.