NTR Vydya Seva Trust: రాజకీయాలకు అడ్డాగా ఎన్టీఆర్ వైద్య సేవ

ABN, Publish Date - Mar 10 , 2025 | 09:55 AM

పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాజకీయాలకు అడ్డాగా మారింది.

పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాజకీయాలకు అడ్డాగా మారింది. వైద్యంపై అవగాహన లేని అధికారులను నియమించడం, అర్హత లేని అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోపెట్టడంతో ఎన్టీఆర్ ట్రస్టు ప్రధాన లక్ష్యం దారి తప్పుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్టులో విభాగాధిపతులు అందిన కాడికి దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర శాఖలకు చెందిన కొంతమంది అధికారులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో వాలిపోయరు.


వీరి రాకతో ట్రస్టు పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అధికారులే ఒకరిపై మరొకరు అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకోవడం ట్రస్టులో వర్గాల వారీగా చీలిపోవడం ఈవోలు, సీఈవోల పోస్టుల విషయంలో ఒక వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడం వీరికి నచ్చని అధికారులపై బయట వ్యక్తులతో వీళ్లే ఫిర్యాదులు చేయించడం వాటిని తీసుకెళ్లి ట్రస్టు సీఈఓల ముందు పెట్టడం ఇలా ట్రస్టును రాజకీయాలకు కేంద్ర బిందువుగా చేశారు. బయట నుంచి వచ్చిన అధికారుల వ్యవహారశైలి ట్రస్టు సీఈఓకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 10 , 2025 | 10:24 AM