Delhi Baba: వెలుగులోకి ఢిల్లీ గలీజ్ బాబా లీలలు.. లుక్‌అవుట్ నోటీసులు జారీ..

ABN, Publish Date - Sep 26 , 2025 | 01:54 PM

ఢిల్లీ గలీజు బాబా లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎఫ్ కెప్టెన్ పంపిన్ మెయిల్‌తో చైతన్యానంద బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ పంపిన మెయిల్ ఆధారంగా శ్రీ సృంగేరీ మఠం.. చైతన్యానంద సరస్వతిని తొలగించింది.

ఢిల్లీ గలీజు బాబా లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎఫ్ కెప్టెన్ పంపిన్ మెయిల్‌తో చైతన్యానంద బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ పంపిన మెయిల్ ఆధారంగా శ్రీ సృంగేరీ మఠం.. చైతన్యానంద సరస్వతిని తొలగించింది. మరోవైపు చైతన్యానంద కోసం పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.


ఢిల్లీలో ప్రముఖ ఆశ్రమానికి చెందిన బాబాపై ప్రస్తుతం లైంగిక ఆరోపణలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ మ్యానెజ్‌మెంట్ సంస్థకు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన చైతన్యానంద సరస్వతి లీలలు ఒక ఈమెయిల్‌‌ ద్వారా బయటికి వచ్చాయి. వసంత్‌కుంజ్ ప్రాంతంలోని విద్యా సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. అసభ్య పదజాలంతో దూషించాడని, అభ్యంతకర సందేశాలను పంపేవాడని, విదేశీ పర్యటన పేరుతో మభ్యపెట్టే వాడని ఆరోపించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Sep 26 , 2025 | 01:54 PM