Mass Coping With AI: ఏఐతో మాస్ కాపీయింగ్..ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్
ABN, Publish Date - Dec 24 , 2025 | 09:30 PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్‌సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్‌సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు. అయితే అనిత్, సతీష్ తమ షర్ట్ బటన్‌లకు అమర్చిన మైక్రో స్కానర్లతో ప్రశ్నపత్రాన్ని కాపీ చేశారు. తర్వాత బ్లూటూత్ ద్వారా జవాబులు వింటూ పరీక్షలు రాశారు. వరుసగా బీప్ శబ్ధం వస్తుండడంతో ఇన్విజిలేటర్ గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్కానర్లు, బ్లూటూత్‌లను స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Dec 24 , 2025 | 09:30 PM