పవన్‌కు పీఎం మోదీ స్పెషల్ గిఫ్ట్

ABN, Publish Date - May 02 , 2025 | 05:20 PM

Modi Gifts To Pawan: రాజధాని అమరావతి పున:నిర్మాణ సభా వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ను చూసి పవన్ హర్షం వ్యక్తం చేశారు.

అమరావతి, మే 2: రాజధాని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభా వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Deputy CM Pawan Kalyan) ప్రధాని మోదీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ ప్రసంగం తర్వాత స్వయంగా ప్రధాని మోదీ (PM Modi).. పవన్‌‌ను తన వద్దకు పిలుచుకున్నారు. ఆపై డిప్యూటీ సీఎం‌కు చాక్లెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు పీఎం. చాక్లెట్‌ను తీసుకున్న పవన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పవన్‌కు మోదీ చాక్లెట్‌ ఇవ్వడంతో పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా నవ్వులు పూయించారు.


పవన్ ప్రసంగం..

రాళ్లు, రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సైబరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అమరావతిని కూడా అపార అనుభవం, దక్షతతో అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతారన్నారు. అమరావతి ఏపీకే కాదు భారత్‌కే తలమానికంగా అవుతుందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో దేశంలో కీలక పరిస్థితులు ఉన్నప్పటికీ అమరావతి రైతులు చేసిన త్యాగాలు మరిచిపోకూడదంటూ.. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినందుకు ప్రధాని మోదీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. కనదుర్గమ్మ ఆశీస్సులతో ప్రధాని మోదీకి బలాన్ని ఇవ్వాలని అందరం ప్రార్థిద్దామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.



ఇవి కూడా చదవండి

Kesireddy SIT Custody: రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి

Read Latest AP News And Telugu News

Updated at - May 02 , 2025 | 05:24 PM