Bijli Mahadev Temple: అలా ముక్కలు అయ్యే శివలింగం ఇలా అతుక్కునేది ఇప్పుడే
ABN, Publish Date - Feb 25 , 2025 | 07:45 PM
ఇది ప్రపంచంలోనే అతి వింతైనా గుడి. ఇలాంటి ఆలయం ఎక్కడ కనపడదు.మచ్చు కమ్మిన ఈ ప్రాంగణంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
ఇది ప్రపంచంలోనే అతి వింతయినా ఆలయం. ఇలాంటి గుడి ఎక్కడ కనపడదు. విచిత్రం ఏంటంటే ఈ అరుదైన ఆలయంపై 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుంది. ఉరుములు, మెరుపులతో విద్యుత్ తీగల హై వోల్టెజ్ మెరుపు ఆలయ శిఖరాన్ని తాకుతుంది. అంతే దెబ్బకు ఆలయం లోపల ఉన్న శివలింగం తునతునకలు అవుతుంది.
అయితే విచిత్రంగా తెల్లవారే సరికి అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. ఆ దారుణ శబ్దానికి చుట్టుపక్కల ఉండే కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. ఈ ఆలయం వెనుక కొన్ని రహస్యాలు అద్బుతమనే చెప్పాలి. దీనిని వింత అనాలో శివలీల అనాలో భక్తులకు అర్థంకాని పరిస్థితి. ఈ ఆలయం పేరు బిజిలీ మహాదేవి మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులువ్యాలీలో ఉంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 25 , 2025 | 07:46 PM