ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్, మెస్సి
ABN, Publish Date - Dec 13 , 2025 | 12:05 PM
ఫుట్‌బాల్ స్టార్ మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 13: ఫుట్‌బాల్ స్టార్ మెస్సి (Football Icon Lionel Messi) ఈరోజు (శనివారం) హైదరాబాద్‌కు రానున్నారు. నేటి రాత్రి మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న మెస్సి గోట్ టూర్.. సంగీత విభావరితో మొదలవనుంది. ఆ తరువాత ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలవుతుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.
20 నిమిషాల పాటు జరిగే ఈ మ్యాచ్‌లో ఆఖరి ఐదు నిమిషాల్లో మెస్సి, రేవంత్ రెడ్డి మైదానంలో బరిలోకి దిగుతారు. నిర్ణీత సమయం ముగిశాక రేవంత్, మెస్సి పెనాల్టీ షూటౌట్‌లు ఆడతారు.
ఇవి కూడా చదవండి...
జయశంకర్ భూపాలపల్లిలో దారుణ ఘటన
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్
Read Latest Telangana News And Telugu News
Updated at - Dec 13 , 2025 | 01:19 PM