కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..
ABN, Publish Date - Jan 27 , 2025 | 02:03 PM
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణ పనులు ప్రకటించింది. కేంద్రం ఇచ్చే సీఆర్ఐఎఫ్ నిధులు సహా రాష్ట్ర వనరుల నుంచి రూ. 2,300 కోట్ల విలువైన రహదారుల నిర్మాణారికి అనుమతులు ఇచ్చారు.
అమరావతి: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లు భవనాల.. ఆర్ అండ్ బీ శాఖ రహదారులు రద్దయ్యాయి. ఇప్పటి వరకు మొదలుపెట్టని రోడ్లు... ప్రారంభించినా.. 25 శాతం లోపే పురోగతి ఉన్న ప్రాజెక్టులను రద్దు చేస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సీఆర్ఐఎఫ్ కింద చేపట్టే రహదారులు కూడా భారీగా ఉన్నాయి. ఈ పరిణామం వైఎస్సార్‌సీపీ నేతలకు.. వారి పేరిట బిడ్లు వేసి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఇండోనేషియా అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు ..
ఈ వార్తలు కూడా చదవండి..
అరేయ్ కోడి గుడ్డు.. అంటూ అమర్నాథ్‌పై లోకేష్ ఫైర్
గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 27 , 2025 | 02:03 PM