అరేయ్ కోడి గుడ్డు.. అంటూ అమర్నాథ్‌పై లోకేష్ ఫైర్
ABN, Publish Date - Jan 27 , 2025 | 01:11 PM
మీడియా సమావేశంలో సాక్షి రిపోర్టర్ ఎవరూ లేరా అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. తాము దావోస్ పర్యటనలో రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడుల వివరాలు ఇద్దమని అనుకున్నానని, ఇది చూసైనా కళ్లు తెరవాలని ఆయన అన్నారు.
విశాఖ: దావోస్ పర్యటన (Davos trip)లో రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేదని వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి అమర్‌నాథ్ (Ex Minister Amarnath) చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా (Media) మంత్రి లోకేష్ (Minister Lokesh)ను ప్రశ్నించగా.. దానిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. ‘అరేయ్ కోడి గుడ్డు.. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. మీరు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం తీసుకు వచ్చారని’ నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో రూ. 6,33,568 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు తీసుకువచ్చామన్నారు. చాలా గర్వకారణమని అన్నారు. కాగ్నిజెంట్ గురించి కూడా ట్వీట్ పెట్టానని.. అది ఎవరూ చూడలేదా.. అని మంత్రి లోకేష్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఈ వార్తలు కూడా చదవండి..
గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..
హుస్సేన్‌సాగర్ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 27 , 2025 | 01:11 PM