ఇండోనేషియా అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు ..

ABN, Publish Date - Jan 27 , 2025 | 01:39 PM

రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఏర్పాటు చేసిన విందులో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్-ఇండోనేషియాకు చారిత్రాత్మకంగా ఎంతో ఘనత ఉందని తెలిపారు. ముఖ్యంగా రెండు దేశాల భాషలు సంస్కృతం నుంచి ఉద్భవించాయన్నారు.

న్యూఢిల్లీ: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనది భారతీయ డీఎన్ఏ అని ఇటీవల పరీక్షల్లో తెలిందన్నారు. రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ విందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇండోనేషియా అధ్యక్షుడు మాట్లాడుతూ నవ్వులు పూయించారు. భారత్-ఇండోనేషియాకు చారిత్రాత్మకంగా ఎంతో ఘనత ఉందని ప్రబోవో సుబియాంతో తెలిపారు. ముఖ్యంగా రెండు దేశాల భాషలు సంస్కృతం నుంచి ఉద్భవించాయన్నారు. చాలా ఇండోనేషియన్ల పేర్లు ఉంటాయన్న ఆయన తమ రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..


ఈ వార్తలు కూడా చదవండి..

అరేయ్ కోడి గుడ్డు.. అంటూ అమర్నాథ్‌పై లోకేష్ ఫైర్

లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు..

గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 27 , 2025 | 01:39 PM