Indians kidnapped in Africa: మాలిలో ఐదుగురు ఇండియన్స్ కిడ్నాప్

ABN, Publish Date - Nov 08 , 2025 | 09:37 PM

పశ్చిమ ఆఫ్రిక దేశమైన మాలి ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్‌ మరింత ఆందోళన రేపింది. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు ఏఈపీకి తెలిపాయి.

పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్‌ కలకలం రేపింది. ఈ విషయాన్ని భద్రతా వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్‌(Mali kidnapping) మరింత ఆందోళన రేపింది. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు ఏఈపీకి తెలిపాయి. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన వారిని రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తామే ఈ కిడ్నాప్‌ చేసినట్టు ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. 2012 నుండి తిరుగుబాట్లు, ఘర్షణలతో అట్టడుగుతున్న దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌(West Africa terrorism)లు సర్వసాధారణంగా మారిపోయాయి.


ఇవి కూడా చదవండి:

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated at - Nov 08 , 2025 | 09:39 PM